
అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అంతేకాదు.. తన కెరీర్ ప్రారంభం నుంచి వస్తున్న క్రింజ్ డైరెక్టర్ అనే కామెంట్స్ పై ఆయన రియాక్ట్ అయ్యాడు. నన్ను కొందరు క్రింజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ క్రింజ్ అనే పదం నాతో పాటు..మొదటి నుంచి ఇప్పటివరకు ప్రయాణిస్తుంది. నేను సంక్రాంతికి వస్తున్నాం లాంటి మరో 10 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన కూడా ఇదే క్రింజ్ కామెంట్స్ వినిపిస్తాయి..
కానీ..అది కేవలం 10 శాతం మంది నుంచి మాత్రమే..మిగతా 90 శాతం మంది నా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. సంతోషంగా టికెట్లు కొంటున్నారు. అలాంటప్పుడు ఆ 10 శాతం మంది చేసే క్రింజ్ కామెంట్స్‌లో ఎందుకు సీరియస్‌గా తీసుకోవాలి. అంతేకాదు..నా సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. నిర్మాతలు వస్తువులతో సాటిస్ఫైడ్‌గా ఉన్నారు. 90 శాతం మందికి నా సినిమాల నుంచి నెగటివ్ స్పందన వస్తే..నేను బాధపడాలి. ఆలోచనలో పడాలి. అంతేకానీ..10 శాతం మంది గురించి నేను పట్టించుకోవాల్సిన పనిలేదు అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు..!!

