in

Anil Ravipudi filed a complaint with the cyber police!

నీల్ తాజాగా సైబర్ పోలీసులని ఆశ్రయించాడు. కారణం తన పై వస్తున్న నెగిటీవ్ వార్తలకి చెక్ పెట్టేందుకే. సంక్రాతికి వస్తున్నాం సినిమా సక్సెస్ తర్వాత కొందరు అనిల్ రావిపూడి పై నెగిటివ్ టాక్ తెస్తున్నారు. అనీల్ కి వ్యతిరేకంగా  వీడియోలు చేసి ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ దీనిపై స్పందించాడు. ‘కొంతమంది కావాలని నా గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీడియోలు చేసి, వాయిస్ ఓవర్ లు ఇచ్చి యూట్యూబ్ లో పెడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే నేను సైబర్ పోలీసులకు కంప్లైంట్  చేశాను..

మీనాక్షి చౌదరి తో నాకేదో కెమిస్ట్రీ కుదిరినట్టు యూట్యూబ్ లో కొంతమంది వీడియోలు చేశారు, అవి బాగా వైరల్ అయ్యాయి. ఫ్రండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాటన్నింటినీ మా ఆవిడకు పంపించారు. దయచేసి నాపై ఇలాంటి వీడియోలు చేయకండి. నాకు మీనాక్షికి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ కుదర్లేదు. మీ వ్యూస్ కోసం మరీ ఇలా దిగజారిపోవద్దు. అసత్య రాతలకి అందమైన వాయిస్ ఇస్తూ జనాలు నమ్మేంత క్రియేటివిటీ వద్దు. నాకు తోచినట్టు సినిమాలు చేసుకుంటున్నా, నా భార్యతో సంతోషంగా ఉన్నాను. అలానే ఉండనీయండి. అని మనవి చేసాడు..!!

HAPPY BIRTHDAY CHANDRASEKHAR YELETI!

karnataka Congress: Rashmika Should be taught a lesson now