టాలీవుడ్‌లో హిట్ మెషిన్‌గా పేరుతెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్స్ అవుతుండటంతో ఇప్పుడు ఆయన పేరు మార్మోగిపోతుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ తాజాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది..
దీంతో ఇప్పుడు అందరి చూపు వచ్చే ఏడాది రాబోతున్న అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి సినిమాపై పడింది. మరోసారి అనిల్ రావిపూడి తనదైన మార్క్ మూవీ మేకింగ్‌తో చిరంజీవికి కూడా ఇదే తరహాలో బ్లాక్‌బస్టర్ అందించాలని అభిమానులు కోరుతున్నారు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి మూవీ కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. మరి మెగాస్టార్ కోసం అనిల్ ఎలాంటి కథను రెడీ చేస్తాడో చూడాలి..!!