
ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో చేస్తున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కొంచెం నెమ్మది గానే కొనసాగితుంది. అయితే ఈ సినిమా కాస్టింగ్ ప్రకారం అధికారికంగా ఇతర నటీనటులు డీటెయిల్స్ బయటకి రాలేదు. అలానే ఇప్పుడు ఓ బాలీవుడ్ స్టార్ ఈ సినిమాలో భాగం అయినట్టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మరి ఆ నటుడు ఎవరో కాదట. బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్ అని తెలుస్తోంది. అనీల్ కపూర్ తెలుగు ఆడియెన్స్ లో కూడా చాలామందికి తెలుసు. ఇటీవల అనిమల్ సినిమా సహా మరిన్ని సినిమాలు తను చేశారు. ఇక లేటెస్ట్ గా తన ఇన్స్టా స్టోరీలో ఎన్టీఆర్ నీల్ పోస్ట్ పెట్టడంతో తను కూడా ఈ భారీ ప్రాజెక్టులో భాగం అయినట్టు తెలుస్తోంది. సో దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది..!!