దయచేసి నాకు హాయ్, హలో అనే మెస్సేజ్‌లు పంపొద్దు. ఈ మెస్సేజ్‌లు కారణంగా పలువురి ప్రాణాలు పోతున్నాయి. సాయం కోరుతూ పంపుతున్న వాళ్ల సందేశాలు కిందకు వెళ్లిపోతున్నాయి. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. ఈ మెసేజ్‌ల కారణంగా అవసరమున్న వారి మెసేజ్‌లు కిందకు వెళ్లిపోతున్నాయి. దానివల్ల నేను ఆ మెస్సేజ్‌లు చూడడానికి కూడా వీలు కావడం లేదు. కాబట్టి ఇదొక సీరియస్ మెసేజ్.
మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల కారణంగా సరైన సమయంలో సాయం అందక కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ప్రస్తుతానికి నేను ఎవరికీ ఆర్థిక సాయం చేయడం లేదు..జోక్ కాదు..ఎందుకు ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారు. కొవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి, ఆసుపత్రులు, మందుల విషయంలో నాకు చేతనైనంత సాయం చేస్తున్నాను. ఇకనైనా మారండి. దయచేసి నాకు సరదా మెస్సేజ్‌లు పెట్టకండి’’ అని రేణు పేర్కొన్నారు.