
మహా నటి సావిత్రి ఆరాధించిన, మరో మహా నటి కన్నాంబ గారు, కొంత మందిని కొన్ని కేరక్టర్స్ కు పరిమితం చేసే చిత్ర సీమలో, అటువంటి పరిమితులు ఏమి లేకుండా అన్ని రకాల పాత్రలు చేసిన గత కాలపు మహా నటి కన్నాంబ గారు. ఆమె నటన ఎంత సహజం గ ఉంటుందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ,ఆమె ఒక పాత్ర నటిస్తున్నప్పుడు పోలీస్ లు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఒక చిత్రం షూటింగ్ సందర్భం లో అప్పటి మద్రాస్ హై కోర్ట్ ఎదురుగా ఒక పెద్దావిడ , ధర్మం చచ్చి పోయింది, దేవుడు లేడు అంటూ , వాహనాలతో రద్దీ గ ఉండే రోడ్ ను దాటే ప్రయత్నం చేస్తూ, వచ్చే పోయే వాహనాలను దాటుకుంటూ, వాటికింద పడపోతుంది, అది చూసిన అక్కడి వారు పోలీస్ కు చెపితే వారు వచ్చి ఆమెను వారించినా వినకుండా పిచ్చిదానిలాగా రోడ్ దాటటానికి ప్రయత్నిస్తున్న ఆమెను, పోలీస్ వాన్ ఎక్కించి స్టేషన్ కు తరలించారు. దారిలో తాను నటి కన్నాంబ అని, తాను ఒక పాత్ర నటిస్తున్నాని ఆ షూటింగ్ కోసమే తాను ఆలా రోడ్ దాటుతున్నానని, ఆవిడ ఎంత చెప్పిన పోలీస్ లు నమ్మలేదు, తరువాత యూనిట్ వాళ్ళు స్టేషన్ చేరుకొని అసలు విషయం వివరించారు, ఆమె నటన, దుస్తులు చూసిన పోలీస్ వారు ఆమె కు సెల్యూట్ చేశారట.కన్నాంబ గారి నటన అంత సహజంగా ఉండేది.అందుకే మహానటి సావిత్రి ఆమెకు వీరాభిమాని, ఆమెతో కలసి నటిస్తున్నప్పుడు పోటీ పడి నటించేవారట సావిత్రి గారు.

