డేరింగ్ అండ్ డాషింగ్ హీరో గ పేరు పొందిన నటుడు కృష్ణ గారు, తెర మీద, తెర వెనుక, ఎన్నో సాహసాలు చేసారు అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. షూటింగ్ సందర్భంగా చిన్న, చిన్న ప్రమాదాలు ఎన్నో చూసారు. కానీ సిరిపురం మొనగాడు అనే చిత్రం షూటింగ్ లో జరిగిన ప్రమాదం ఆయనను చావు అంచుల దాక తీసుకొని వెళ్ళింది. సిరిపురం మొనగాడు చిత్రం షూటింగ్ ఊటీ లో జరుగుతున్నది, ఆ రోజు ఒక ఫైట్ సందర్భం గ ఒక ఫిరంగి పేల్చి ఊరి మీదకు వస్తున్నా దోపిడీ దొంగలను అడ్డుకొనే సీన్ షూట్ చేస్తున్నారు. డైరెక్టర్ కే.ఎస్.ఆర్. దాస్ యాక్షన్ అనగానే ఫిరంగి ని కాగడాతో వెలిగించారు నటుడు వేలు గారు, కృష్ణ గారు ప్రక్కనే ఉన్నారు అది పేలలేదు. వెంటనే అక్కడే ఉన్న ఎక్సప్లోజివ్ నిపుణుడు అందులో మరి కొంత మెటీరియల్ నింపారు, మళ్ళి వేలు గారు కాగడా తో వెలిగించారు, అది ఒక్క సారిగా పేలిపోయింది, ప్రక్కనే నిలబడి ఉన్న కృష్ణ గారు రక్థసిక్తమయి నేల మీద పడిపోయారు.
స్పాట్ లో ఉన్న వారి పై ప్రాణాలు పైనే ఎగిరి పోయాయి. కృష్ణ గారికి ఛాతి మీద, పొట్ట మీద, కుడి చేతి కి గాయాలు అయ్యాయి వెంటనే హాస్పిటల్ కు తరలించారు,అదృష్ట వశాత్తు లోతయిన గాయాలు కాలేదు, ఊటీ లోని హాస్పిటల్ లోనే నాలుగు రోజులు ట్రీట్మెంట్ తీసుకొని, మద్రాస్ వచ్చి విజయ హాస్పిటల్ లో మరో పది రోజులు ట్రీట్మెంట్ తరువాత కృష్ణ గారు పూర్తి గ కోలుకున్నారు. ఆ సంఘటనతో కృష్ణ గారి అభిమానులు, పరిశ్రమలోని వారు చాల ఆందోళన కు గురి అయ్యారు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన కృష్ణ గారు వెంటనే షూటింగ్ లో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన, నిర్మాతలు, డైరెక్టర్లు మరి కొంత కాలం రెస్ట్ తీసుకోమని ఇచ్చిన సలహా మేరకు మరి కొద్దీ రోజుల తరువాత షూటింగ్ లో పాలుగోన్నారు..