
తొలి తరం హాస్య నటులలో తనది అయినా ప్రత్యేక శైలి తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన హాస్య నటుడు పద్మనాభం గారు.నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రతిభ ను చాటుకున్న నటుడు పద్మనాభం గారు.మన జీవితం లో జరిగిన మంచి సంఘటనల కంటే, చేదు సంఘటనలే జీవితాంతం వెంటాడుతాయి, అటువంటి సంఘటన ఒకటి పద్మనాభం గారిని వెంటాడింది. జాతకరత్న మిడతంభొట్లు సినిమా లో మిడతంభొట్లు ను రాజు దగ్గరకు తీసుకొని వెళుతున్నప్పుడు ఒక అంధుడు “ఇతడు చేసిన నేరం ఏమిటి” అని అడుగుతాడు ఆ సీన్ లో నటించేందుకు నిజమయిన అంధుడిని తీసుకొచ్చి నటింపచేసారు, అతనికి 5000 రూపాయలు ఇచ్చిఅందరిని ఆశ్చర్యానినికి గురి చేసారు పద్మనాభం గారు. ఇలా అంధుల బధిరుల స్కూల్స్ కు కూడా విరాళాలు విరివిగా ఇచ్ఛేవారు పద్మనాభం గారు. దీని వెనుక ఒక బలమయిన సంఘటన ముడిపడి ఉన్నది అయన జీవితం లో. చిన్నతనం లో ఒక అంధుడి కంచం లో రాయి వేసి అందులోని చిల్లర దొంగతనం చేసారు పద్మనాభం గారు, అయన సినీ పరిశ్రమ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన, తెలిసి తెలియని వయసులో చేసిన పొరపాటు ఆయనను వెంటాడుతూ ఉండేది. ఆ సంఘటన తాలుకు బాధను, తప్పు చేశాను అనే భావన నుంచి తప్పించుకోవటానికి అయన అంధుల పట్ల చాలా ఉదారంగా ప్రవర్తించే వారు. ఎంత చేసిన తాను చేసిన తప్పు కు ఫలితం అనుభవిస్తానేమొ అనే అభత్రతా భావం పద్మనాభం గారిని వెంటాడింది. దానికి తగినట్లు గానే సినీ పరిశ్రమ లో ఎంతో ఉన్నత స్థానాన్ని చేరిన, ఎంతో డబ్బు సంపాదించినా తన చివరి రోజులలో పూట గడవని పరిస్థితులు అనుభవించారు పద్మనాభం గారు.

