
కొన్ని పనులు కొంత మందే చేయగలరు, అందుకే వారు, వారి రంగాలలో మంచి గుర్తింపు పొందుతారు, మార్గదర్సకులు అవుతారు. గుర్తింపు లభించాక అందరు వారి గురించి చెపుతారు కానీ దానికి ముందు వారి జీవితం లో వారికీ ఎదురైనా సంఘటనలు వారు ఆలా తయారవ్వటానికి దోహదం చేశాయో ఎవరికి తెలియదు. దాసరి నారాయణ రావు గారి జీవితం అందుకు ఓక గొప్ప ఉదాహరణ. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే , డైరెక్షన్ దాసరి నారాయణ రావు అని స్క్రీన్ మీద చూసినప్పుడు, ఇన్ని శాఖలు ఒక్కరు నిర్వహించటం సాధ్యమేనా అనిపించేది. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చిన నేనున్నాను అని వారికీ అవసరమయిన సహాయ సహకారాలు అందించే మానవత్వం .ఇండస్ట్రీని శాసించగలిన నాయకత్వ లక్షణం, వారికీ చిన్నతనం నుంచే అబ్బింది. అయన 6 వ తరగతి చదివే రోజుల్లో ఆర్ధికంగ చితికిపోయిన వారి నాన్న గారు దాసరిని చదువు మాన్పించి ఓక వడ్రంగి వద్ద సహాయకుడిగ చేర్పించారట, అనుకోకుండా వారి స్కూల్ మాస్టారి కంట పడిన దాసరి ని ఆ మాస్టారు తీసుకెళ్లి, సహా విద్యార్థులు చూపిన వితరణ తో ఫీజు కట్టినపుడే తెలుసుకున్నారు ఇతరులకు చేయూత ఇవ్వటం అంటే ఏమిటో. బుక్స్, ఇతరత్రా అవసరాల కోసం, సాయంత్రాల్లో భుజం మీద కావడి వేసుకొని అరటి పండ్లు అమ్మినపుడు అలవాటైంది బరువు బాధ్యతలు మోయటం అంటే ఏమిటో. ఇన్ని కష్టాల మధ్య క్లాస్ లీడర్, స్కూల్ లీడర్ గ ఎదిగిన నాయకత్వ లక్షణం సినీ పరిశ్రమలో ఆయనకు పనికి వచ్చింది, అందుకే అయన సినీ రంగం లో నెంబర్ వన్. అందుకే అన్ని తానై సినిమా విజయానికి పాటుపడేవారు అయన. ఆకలి, అవసరం తెలుసు కాబట్టే సినీ కార్మికులకు, చిన్న నిర్మాతలకు అండగా నిలబడే వారు దాసరి గారు. సినీ పరిశ్రమ చేత పెద్దాయన అనిపించుకున్న అయన ప్రవర్తన వెనుక పెద్ద కష్టాల ఎదురీత, అనుభవం దాగి ఉన్నది. బాగుంటటం అంటే మనం ఒక్కరమే బాగుండటం కాదు, మన చుట్టూ ఉన్న వారు కూడా బాగుండాలి అని నమ్మిన గొప్ప వ్యక్తిత్వం దాసరి గారిది.

