in

‘andharivadu’ actress Rimi Sen cheated of Rs 4.14 crore!

సాధార‌ణంగా హీరోయిన్లు సినిమాలు, ఈవెంట్లు అంటూ వృత్తిప‌ర‌మైన క‌మిట్ మెంట్స్‌తో బిజీగా ఉంటుంటారు. వారికున్న బిజీ షెడ్యూల్స్ కెరీర్‌ను కొన‌సాగిస్తున్న క్ర‌మంలో ఒక్కోసారి కొంద‌రు క‌న్నింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ల చేతిలో ఇరుక్కొని, ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి తాజాగా బాలీవుడ్ న‌టి రిమీ సేన్ విష‌యంలో జరిగింది. వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి చేతిలో ఘోరంగా మోసపోయింది రిమీ. ఇప్పుడు ఈ వార్త బీటౌన్ తోపాటు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవితో అందరివాడు చిత్రంలో నటించి మెప్పించిన రిమీ సేన్.. పలు భాషల్లో హీరోయిన్ గా రాణించి.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్థిరపడిపోయింది..

అయితే మూడేళ్ల క్రితం వ్యాపారవేత్తగా చెప్పుకునే రౌనక్‌ జతిన్‌ వ్యాస్‌ మాయమాటలని నమ్మి.. హీరోయిన్ రిమీ సేన్‌ ఏకంగా రూ. 4.14 కోట్లు మోసపోయింది. ముంబై అంధేరిలోని జిమ్‌లో ఈ వ్యక్తితో రిమీ సేన్‌ కి పరిచయం ఏర్పడిందట. తర్వాత తామిద్దరం స్నేహితులయ్యామని చెప్పుకొచ్చింది రిమీ సేన్. జరిగిన దారుణం గురించి వివరిస్తూ.. మంచి రాబడులు వస్తాయని చెప్పి ఒక కొత్త వెంచర్‌లో పెట్టుబడి పెట్టమని తనకు రౌనక్‌ జతిన్‌ ఆఫర్‌ చేశాడని వెల్లడించింది రిమీ. అసలు జతిన్‌ వ్యాస్‌ కొత్త కంపెనీని ప్రారంభించలేదని తెలిసి తాను మోసపోయినట్లు గ్రహించినాని చెప్పుకొచ్చింది. జతిన్‌ వ్యాస్‌పై ఐపీసీ సెక్షన్‌లు 420, 409 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ముంబైలోని ఖర్‌ పోలీసులు తెలిపారు. రౌనక్‌ జతిన్‌ వ్యాస్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

red beauty malvika sharma latest clicks!

John Abraham says he will never do a Telugu or regional film!