in

Anchor Ravi apologizes for hurting Hindu sentiments!

శివాలయాల్లో గర్భగుడి ముందు నందీశ్వరుడు ఉండడం, ఆయన కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడాన్ని హిందూ సంప్రదాయం ఎంతో పవిత్రంగా భావిస్తుంది. కానీ ఇటీవల ఒక టీవీ షోలో ఈ సాంప్రదాయాన్ని సరదాగా చూపించడంతో పెద్ద వివాదమే చెలరేగింది. ప్రముఖ యాంకర్ రవి హోస్ట్ చేస్తున్న “సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్” షోలో సుడిగాలి సుధీర్ టీమ్ రూపొందించిన స్కిట్ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి..

ఈ స్కిట్‌లో నంది కొమ్ముల మధ్య నుంచి హీరోయిన్ ను చూపించడం హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. వివాదం పెద్ద స్థాయిలో చర్చకు దారి తీసింది. హిందూ సంస్థలు గట్టిగా స్పందించడంతో యాంకర్ రవి దీనిపై స్పందిస్తూ ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు. “ఈ స్కిట్ వల్ల ఎవరికైనా అనవసరమైన బాధ కలిగితే దాని బాధ్యత నాదే. ఇది మా ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు. ఒక సినిమా సీన్‌ను స్పూఫ్‌గా ప్రదర్శించాం. కానీ అది ఇలా అభ్యంతరకరంగా మారుతుందని అనుకోలేదు. భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం,” అని రవి స్పష్టం చేశారు..!!

milky beauty Tamannaah Charges Big For ‘Nasha’ Song!

Anupama-Dhruv's secret Spotify romance? Intimate playlist pic sends fans into frenzy!"

Anupama & Dhruv: Dating Rumors After Playlist Kiss?