తాజాగా అనసూయ ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ తో కలిసి ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో 20 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయిలు 30 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిలని కోరుకుంటున్నారు కదా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం మాట్లాడుతూ మీరు చెప్పేది సెక్సువల్ గానా అంటూ డైరెక్ట్ గా అడిగేసారు. అంటే అది సెక్సువల్ అని కాదు లస్ట్ కామం అని నిఖిల్ అనడం..
దాంతో వెంటనే అనసూయ అందుకొని లస్ట్ అంటే సెక్సే కదా అంటూ మాట్లాడారు. సెక్స్ అనేది చాలా అవసరం దానిని జనాలు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. ఇక సెక్స్ అవసరమంటే బహిరంగంగా చేయటం దాని గురించి మాట్లాడటం అని కాదు. కాకపోతే ఆ విషయం గురించి తప్పు పట్టాల్సిన పనిలేదని దాని గురించి మాట్లాడటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అంటూ ఓపెన్ గా సెక్స్ గురించి మాట్లాడుతూ ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..!!