తాజాగా అనసూయ ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ అనే కార్యక్రమంలో పాల్గోంది. అందులో భాగంగా ఆమె తన జీవితంలో జరిగిన మంచి చెడులను పడిన కష్టాలను సైతం చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టెలివిజన్ తనకు అమ్మవంటిదని.. వెండితెరెమో నాన్నలాంటిదని తెలిపింది. తాను ఈ రంగంలో రావాడినికి ఎంతో కష్టపడిందట. అంతేకాదు మొదట్లో తన కుటుంబం ఎన్నో కష్టాల్నీ ఎదుర్కోనాల్సీ వచ్చిందని చెప్పింది.
తన కోసం తన సిస్టర్స్ కోసం వాళ్ల అమ్మ ఎంతో కష్టపడిందని, చీరలకు ఫాల్స్ కుట్టి మరీ చదివించిందని చెబుతూ.. అప్పటి జ్ణాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురైంది అనసూయ. ఆమె మాట్లాడుతూ.. ఉంటున్న ఇంటి కిరాయి కట్టలేక తక్కువ అద్దెకు దొరికే ఇళ్ల కోసం వెతికి.. అక్కడి మారిపోయేవాళ్లమని తెలిపింది. కొన్ని కొన్ని సందర్బాల్లో ఓ 50 పైసలు ఆదా చేయడానికి బస్సు ఎక్కకుండా రెండు బస్టాప్‌లు నడిచి.. ఆ తర్వాత బస్సు ఎక్కేదాన్నంటూ కన్నీటి పర్యంతమైంది అనసూయ.