in

Anasuya reacts to aunty comments in an public place!

నసూయ హోలీ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదిక మీద డ్యాన్స్ చేసి అలరించారు. ఆ తర్వాత ఆమె మైక్ తీసుకుని మాట్లాడారు. ఆమె మాట్లాడటం ప్రారంభించగానే కొందరు వ్యక్తులు ‘ఆంటీ’ అంటూ కేకలు చేశారు. అయితే దానిని పట్టించుకోకుండా అనసూయ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోకు పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియోకు వచ్చిన కామెంట్లతో కొందరు రీల్స్ చేశారు..

దీనిపై అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇతరుల బాధలో ఆనందాన్ని వెతుక్కోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన విమర్శల కామెంట్లతో రీల్స్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇతరుల బాధలో ఆనందం వెతుక్కోవడం సరికాదని అన్నారు. పక్కవారి పట్ల కనీస సానుభూతి, సామాజిక బాధ్యత లేని వారిని ఈ సమాజం నిలదీసే రోజు రావాలని అన్నారు. వయస్సును బట్టి హేళన చేయడం, మహిళలపై వివక్ష చూపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు..!!

happy birthday SHARWANAND!

Mrithyunjay!