నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తన దుస్తులపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చారు. దుస్తులపై తన అభిప్రాయాన్ని సూటిగా స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి చర్చనీయాంశమవుతున్నాయి. కొంతమంది విమర్శకులు ఆమె దుస్తులపై, స్టైల్‌పై, తల్లితనంపై ప్రశ్నలు లేవనెత్తుతూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్న నేపధ్యంలో ఆమె ఈ ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు.
అనసూయ తన ట్వీట్‌లో “నేను ఇష్టపడే దుస్తులు ధరించడం వల్ల నా విలువలు తగ్గిపోవు” అని పేర్కొన్నారు. తాను భార్యగా, తల్లిగా ఉన్నా కూడా తన వ్యక్తిత్వం మారదని ఆమె స్పష్టం చేశారు. తన కుటుంబం తనను పూర్తిగా అంగీకరించిందని, తనపై నమ్మకం ఉంచిందని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో అనవసర విమర్శలు చేసే వారికి ఆమె ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. “మీ అభిప్రాయం మీద నేను తీర్పు చెప్పను. మీరు కూడా నా జీవనశైలిపై తీర్పు ఇవ్వకుండా గౌరవం చూపాలి” అని ఆమె అన్నారు..!!