
అనసూయ తాజాగా ఆమె అభిమానుల ప్రశ్నలకు సమాధానంగా, తనకి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంది.’మీ తొలి పారితోషికంతో ఏం చేశారు?’ అనే ప్రశ్నకు, ‘మా అమ్మకు గోల్డ్ రింగ్ కొనిచ్చాను. అది నాకు ఎంతో సంతోషాన్ని .. సంతృప్తిని ఇచ్చిన సందర్భం’ అని సమాధానమిచ్చింది. ‘ఛాలెంజింగ్ గా తీసుకుని మీరు చేసిన రోల్ ఏది?’ అనే ప్రశ్నకు స్పందిస్తూ .. ‘నేను ఇంతవరకూ ఛాలెంజింగ్ అనుకుని చేసిన రోల్ ఏదీ లేదు .. ఎందుకంటే అసలు అలాంటి రోల్ నాకు రాలేదు’ అని చెప్పింది. అలాగే తదుపరి సినిమాల గురించి అడిగిన ప్రశ్నకి, ‘ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాను. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ సినిమాల షెడ్యూల్స్ అన్నీ కూడా గజిబిజిగా మారిపోయాయి’ అని బదులిచ్చింది.

