in

Ananthika Sanilkumar: never thought would do intimate scenes

మ్యాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ అనంతిక లేటెస్ట్ గా 8 వసంతాలు సినిమాతో వస్తుంది. ఫణీంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమా 20న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో అనంతిక ఇంటిమేట్ సీన్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇంటిమేట్ సీన్స్ చేయడం చాలా కష్టం ఇప్పటివరకు నేను అలాంటి సీన్స్ చేయలేదని అంటుంది అనంతిక. అలా అని తాను ఇంటిమేట్ సీన్స్ చేయనని చెప్పట్లేదని..కథ డిమాండ్ చేస్తే ఇంటిమేట్ సీన్స్ కూడా చేస్తా ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని అంటుంది అమ్మడు..

ఐతే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా వాటిని బట్టి ఫాలో అవ్వాల్సిందే అంటుంది ఈ హీరోయిన్..మ్యాడ్ సినిమాలో అనంతిక ప్రేక్షకులను అలరించింది. ఐతే 8 వసంతాలు సినిమాతో ఆమె మొదటిసారి ఫిమేల్ సెంట్రిక్ అటెంప్ట్ చేస్తుంది. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. మరి అనంతిక చెప్పినట్టుగా ఆమెను ఇంటిమేట్ సీన్స్ కి ప్రేరేపించే కథ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. హీరోయిన్ గా తనకు పెద్ద డ్రీమ్స్ ఏమి లేవంటున్న అనంతిక మంచి నటిగా పేరు తెచ్చుకుంటే చాలని అంటుంది..!!

rashmika likes each and everything about Vijay Deverakonda!

Samantha, Naga Chaitanya re-unite for promoting ‘Ye Maaya chesave’ re-release?