అనగనగా ఒక విలన్, ఆరుగురు హీరోలు. జనం కోసం హీరోలు పుడుతుంటారు, హీరోల కోసం పుట్టిన విలన్ కైకాల సత్యనారాయణ గారు. రాజనాల గారి తరువాత వెండితెర విలన్ గ మూడు తరాల నటులందరి తో కల్సి నటించిన ఘనత ఆయనది. విలన్ గ ఆయన దాదాపుగా అప్పటి అందరు హీరోలతో నటించారు. విలన్ గానే కాక క్యారెక్టర్ నటుడిగా మారి తన సత్తా చాటారు కైకాల సత్యనారాయణ. నటుడన్న వాడు అన్ని రకాలపాత్రలు చేయగలిగి ఉండాలి అని చెప్పటానికి నిలువెత్తు నిదర్శనం కైకాల. నటుడిగానే కాక, నిర్మాతగా మారి, ఆరుగురు హీరోలతో సినిమాలు తీశారు..
1 యెన్.టి.ఆర్. తో ” గజదొంగ” 2 కృష్ణ, శోభన్ బాబు లతో “ఇద్దరు దొంగలు” 3 శోభన్ బాబు తో ” అడవి రాజా” 4 చిరంజీవి తో ” చిరంజీవి” “కొదమ సింహం” 5 అక్కినేని తో ” బంగారు కుటుంబం” 6 బాలయ్య బాబు తో “ముద్దుల మొగుడు” వంటి విజయ వంతం అయినా సినిమాలు నిర్మించి, మంచి అభిరుచి కల్గిన నిర్మాతగా నిలిచారు. సత్యనారాయణ గారికి నటుడిగా పరిచయం అవసరం లేదు, కానీ ఆయన నిర్మాత గ సినిమాలు నిర్మించిన విషయం చాల కొద్దీ మందికి తెలుసు. అందుకే ఒక విలన్ ఆరుగురు హీరోలు అని పరిచయం చేయవలసి వచ్చింది.