బ్రిటీష్ నటి అయిన ఇండియన్ పోలికలతో అమీ జాక్సన్ ఉండే సరికి ఆమెకు మన సినిమాలలో ఆఫర్స్ బాగా వచ్చాయి. ఐ,రోబో వంటి సినిమాలతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే బిడ్డను కని వార్తలలోకి ఎక్కింది. జార్జ్ పనాయిటోను ప్రాణంగా ప్రేమించిన అమీ జాక్సన్ అతడిని పెళ్లాడాలని భావించింది. 2019 మేలో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడింది.
మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయోటౌతో అమీ 2015 నుండి డేటింగ్ చేస్తోంది. జార్జ్ బ్రిటిష్ ప్రాపర్టీ డెవలపర్ ఆండ్రియాస్ పనాయిటౌ, ది ఎబిలిటీ గ్రూప్ వ్యవస్థాపకుడు. హిల్టన్, డబుల్ ట్రీ, పార్క్ ప్లాజా, వంటి పేర్లను కలిగి ఉన్న లగ్జరీ హోటళ్ల యజమాని. పెళ్లి కాకుండానే ప్రెగ్నన్సీ రావడంతో అమీ గర్భవతిగా ఉండగానే 2019లో ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరి ప్రేమకు ప్రతీకగా అదే ఏడాది సెప్టెంబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది అమీ జాక్సన్.
పెళ్లి కాకముందే తల్లైన అమీ జాక్సన్ తన కొడుకుతో పాటు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునేది. అయితే అమీ సడెన్‌గా తన సోషల్ మీడియాలో ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలన్నింటిని తొలగించేసింది. ఇది చూసి నెటిజన్స్ షాక్ అయ్యారు. ఇదేంది పెళ్లికి ముందే కాబోయే భర్తతో తెగదెంపులు చేసుకుందా ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.