అభిలాష” అనే హిట్ చిత్రంలో చిరంజీవి గారు నటించటానికి మూల కారణం ఎవరో తెలుసా ? చిరంజీవి గారి తల్లి అంజనా దేవి గారు. అప్పుడప్పుడే హీరో గ నిలదొక్కుకొని పాపులర్ అవుతున్న చిరంజీవి గారు ఒక రోజు షూటింగ్ నుంచి వచ్చే సరికి చాల దీక్ష గ ఆంధ్ర జ్యోతి వీక్లీ చదువుతున్న తల్లి ని చూస్తూ వెళ్లి అయన స్నానం చేసి కాసేపు రిలాక్స్ అయి హాల్ లోకి వచ్చేసరికి ఆవిడ ఇంకా చదువుతూ కనిపించారు, ఏంటమ్మా అంత సీరియస్ గ చదివేస్తున్నావు అని ప్రక్కన కూర్చున్న చిరంజీవి ని చూసి, శంకర,అభిలాష అని యండమూరి వ్రాస్తున్న సీరియల్ చాల బాగుంది, ఇందులో హీరో పేరు చిరంజీవి, ఈ స్టోరీ ఎవరైనా సినిమా తీస్తే నువ్వు నటించు, చాల మంచి సినిమా అవుతుంది అని చెప్పారు.
ఈ సంఘటన జరిగిన కొంత కాలానికి , కే.ఎస్. రామ రావు గారు అభిలాష నవల చిరంజీవి గారి చేతిలో పెట్టి, సర్ చాలా మంచి నవల మీరు చదివి ఓ.కే. చేస్తే మనం సినిమా చేద్దాం అన్నారు. సహజం గ నవల చదివే అలవాటు లేని చిరంజీవి గారు నవల పేజీలు అటు,ఇటు తిప్పి యాదృచ్చికం గ కవర్ పేజీ చూసారు, కొద్దీ రోజుల క్రితం అమ్మ చెప్పిన యండమూరి నవల అభిలాష, అమ్మ చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి, నవల చదవకుండానే ఓ.కే. చెప్పేసారు. కే.ఎస్. రామ రావు. యండమూరి, కోదండ రామి రెడ్డి, ఇళయ రాజా కాంబినేషన్ కు బీజం పడింది. సినిమా ఘన విజయం సాధించింది, కోదండ రామి రెడ్డి కి స్టార్ డైరెక్టర్ ఇమేజ్, చిరంజీవి గారికి నవల హీరో గ ఇమేజ్, ఈ కాంబినేషన్ వరుసగా ఐదు చిత్రాలు చేసారు.