ప్రముఖ సినీ నటి అమలాపాల్ సంచలన కామెంట్లు చేసింది. “ఆడై” (ఆమె) సినిమాలో తాను నగ్నంగా నటించడంపై ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. తాజాగా అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అమలాపాల్ మాట్లాడుతూ షూటింగ్ సమయంలో 15 మంది పురుషులు నా చుట్టూ ఉన్నారు. వారందరిని నేను నా భర్తలుగా భావించి నగ్నంగా నటించాను. లేకపోతే ఆ సీన్ లో నేను నటించకపోయే దాన్ని అంటూ సంచలన కామెంట్లు చేసింది.
ఈ సీన్ ను షూట్ చేసిన సమయంలో నగ్నంగా ఉండాలని నిర్మాతలు ముందుగానే సమాచారం ఇచ్చారు. దానికి ఒప్పుకున్న తర్వాతనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. లేకపోతే ఈ సినిమాలో నేను నటించేదాన్ని కాదు. సినిమాలో నటించడం కోసం ఎలాంటి అవకాశాన్ని కూడా నేను వదులుకోనంటూ అమలాపాల్ సంచలన కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుండగా దీనిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల కోసం ఎంతకైనా తెగిస్తావా కొంచమైనా బుద్ధి ఉండాలి కదా అని సీరియస్ అవుతున్నారు..!!