అల్లువారి అబ్బాయి అల్లు శిరీష్ ప్రేమలో ఉన్నాడంటూ కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సినీ నటి అను ఇమ్మాన్యుయేల్ తో ఆయన రిలేషన్ షిప్ లో ఉన్నాడని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. దీనిపై అల్లు శిరీష్ స్పందించాడు. తన తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ..సినీ నటులపై ఇలాంటి వార్తలు రావడం సహజమేనని చెప్పాడు. గతంలో కూడా తనపై ఇలాంటి వార్తలు వచ్చాయని తెలిపాడు. అనుకు, తనకు మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, తాము మంచి స్నేహితులమని చెప్పాడు.
సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు చూస్తే చాలా నెగెటివిటీ ఫీలవుతామని..అందుకే తాను రెండేళ్ల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని తెలిపాడు. ఈ సినిమా కోసం అను ఇమ్మాన్యుయేల్, తాను ఇద్దరం కలిసి కొన్ని నెలల పాటు పని చేశామని..ఇద్దరి మధ్య మంచి అనుబంధం నెలకొందని శిరీష్ తెలిపాడు. తమ ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకే మాదిరి ఉన్నాయని చెప్పాడు. పని విషయంలో అను చాలా ప్రొఫెషనల్ గా ఉంటుందని..అందువల్లే రొమాంటిక్ సన్నివేశాలు చేసేటప్పుడు తాము ఇబ్బంది పడలేదని తెలిపాడు..!!