in

allu arjun pushpa 3 on cards?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా పుష్ప 3 గురించి ఓ పుకారు వైరల్ గా మారింది. పుష్ప-2 సినిమా ఎండింగ్‌ లో మూడో పార్ట్ గురించి ఓ అదిరిపోయే లీడ్ ను దర్శకుడు సుకుమార్ సాలిడ్ గా ప్లాన్ చేశాడని..

ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఓ పాపులర్ స్టార్ ఎంట్రీ ఇస్తారని..అది మూడో పార్ట్‌కు లీడ్‌గా మారుతుందని ఆ పుకార్ల సారాంశం..అయితే, ఈ పుకార్ల ప్రచారం పై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక ‘పుష్ప-2’ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో, ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి..!!

Remember King Nag in ‘Shiva’ film? He Was Not First choice!

JR NTR Prashanth Neel to Have Bangladesh Backdrop?