అల్లు అర్జున్ హీరోగా మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా రానుందని ఇటివల వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ పాత్ర 90వ దశకంలో దేశంలోని పిల్లలను విపరీతంగా ఆకట్టుకున్న ‘శక్తిమాన్’ కథాంశంతో ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తల్లో వాస్తవం లేదని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ‘శక్తిమాన్ పూర్తిగా బాలీవుడ్ సినిమా. ఇందులో రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తారు. ఆయనతోనే సినిమా ఉంటుంద’ని క్లారిటీ ఇచ్చారు.
అయితే..ఈ వార్తలు ఎలా వచ్చాయన్నది తనకు తెలీదని చెప్పుకొచ్చారు. సుదీర్ఘ కాలంగా ఈ ప్రాజెక్టుపై బాలీవుడ్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఎట్టకేలకు దీనిని రణ్ వీర్ సింగ్ చేయనున్నారని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో పునర్జన్మలు, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సినిమా చేస్తున్న అల్లు అర్జున్.. తర్వాత బసిల్ జోసెఫ్ తోనూ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇది ఏ తరహా సినిమా అనేది ఇంకా స్పష్టత లేదు..!!