
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ హిట్ కాంబో నాలుగోసారి పునరావృతం కానుందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. సుమారు ఐదేళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది..
మీడియా కథనాల ప్రకారం, ఈసారి వీరి కలయికలో ఓ భారీ పౌరాణిక చిత్రం రానుందని సమాచారం. ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో, సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్, విజువల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో అల్లు అర్జున్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి..!!
