in

allu arjun and tamil director atlee’s film called off!

ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డిలతో చర్చలైతే జరిగాయి కానీ.. సినిమా లాక్ కాలేదు. చివరికి అట్లీ దర్శకత్వంలో నటించడానికి బన్నీ సూత్రప్రాయంగా అంగీకరించాడని.. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు. సన్ పిక్చర్స్‌తో కలిసి అల్లు అర్జున్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. మరి అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమా ఎందుకు ముందుకు కదలట్లేదు అని సందేహం రావడం ఖాయం.

కానీ ఈ ప్రాజెక్టు మాత్రం దర్శకుడి పారితోషకం విషయంలో అభ్యంతరాలు తలెత్తి ఆగినట్లు తెలుస్తోంది. అట్లీ ఏకంగా రూ.80 కోట్ల పారితోషకం అడిగాడట ఈ చిత్రానికి. ఈ నేపథ్యంలోనే అతను రూ.80 కోట్లు పారితోషకం డిమాండ్ చేయగా.. దర్శకుడికే ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ ప్రాజెక్టును వర్కవుట్ చేయడం కష్టమని అల్లు అరవింద్ వెనక్కి తగ్గారట. అందుకే ఈ సినిమా క్యాన్సిల్ అయిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం..!!

top 10 telugu best web series!

sukumar taking unnecessary blames for pushpa 2 postpones!