in

Allu Arjun and Basil Joseph in talks for ‘Shaktimaan’!

కాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో ముడిపడి వినిపిస్తోంది. ఒకప్పుడు భారతీయ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సూపర్ హీరో ‘శక్తిమాన్’ కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోందని, ఇందులో శక్తిమాన్ పాత్రను అల్లు అర్జున్ పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ‘మిన్నల్ మురళి’ వంటి సూపర్ హిట్ సినిమాతో ఆకట్టుకున్న మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం..

ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. లభించిన సమాచారం ప్రకారం, ఈ సినిమాను భారతీయ పురాణ కథలకు ఆధునిక సూపర్ హీరో హంగులను జోడించి తెరకెక్కించనున్నారు. పాత ‘శక్తిమాన్’ టీవీ సిరీస్‌లోని నైతిక విలువలను, స్ఫూర్తిని కొనసాగిస్తూనే, నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఉత్కంఠభరితమైన కథనంతో ఈ సినిమాను రూపొందించాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.!1

HAPPY BIRTHDAY KORATALA SIVA!

amala paul shocking revelations about doing Nude Scenes!