హాస్యంతో పాటు విలక్షణ కథలతో గుర్తింపు పొందిన అల్లరి నరేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ‘ఫ్యామిలీ డ్రామా’ చిత్రంతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మెహర్ తేజ్ ఈ సినిమాకు కథ, దర్శకత్వం అందిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆల్కహాల్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తోంది..
ఈ పోస్టర్‌లో అల్లరి నరేష్ మద్యం మయం అయినట్లుగా కనిపిస్తూ, సినిమా కథ భ్రమా లేక వాస్తవమా అన్న ఉత్సుకతను పెంచుతోంది. ఈ చిత్రంలో రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సంగీతం గిబ్రాన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీకి జిజు సన్నీ బాధ్యతలు తీసుకున్నారు. ఎడిటింగ్‌ను నిరంజన్ దేవరమానే చేస్తున్నారు. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి సహ నిర్మాతగా పని చేస్తున్నారు. ఇప్పటికే విజయవంతమైన చిత్రాల పరంపరలో ఉన్న నాగవంశీ, ఈ సినిమాతో మరో హిట్ అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు..!!