in

allari naresh decided not to do comedy movies from now?

ల్లరి నరేష్ ఒకప్పుడు తన కామెడీ చిత్రాలతో ఒక ఊపు ఊపేసాడు. లిమిటెడ్ బడ్జెట్ తో కామెడీ జోనర్ లో సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు. ఏడాదికి దాదాపు ఆరు సినిమాల వరకూ విడుదల చేసేవాడు అల్లరి నరేష్. అయితే ఈ మధ్య ఈ కామెడీ హీరో దూకుడు బాగా తగ్గించాడు. నరేష్ టైపు కామెడీ చిత్రాలకు ఆదరణ కరువైంది. నరేష్ వరసగా ప్లాపులను అందుకుంటున్నాడు. ఇటీవలే అల్లరి నరేష్ హీరోగా వచ్చిన బంగారు బుల్లోడు సూపర్ ప్లాప్ గా నిలిచింది.

ఈ సినిమా వచ్చి వెళ్లిన విషయం కూడా ఎవరికీ తెలీలేదు. అల్లరి నరేష్ కు ఈ జోనర్ లో మార్కెట్ పడిపోయిన విషయాన్ని ముందుగానే గ్రహించి ఇప్పుడు సీరియస్ సబ్జెక్ట్స్ వైపు దృష్టి మళ్ళించాడు. మహేష్ బాబు మహర్షిలో ఒక సీరియస్ రోల్ చేసిన అల్లరి నరేష్, నాంది అనే మరో సీరియస్ సబ్జెక్ట్ ను కూడా చేసాడు. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ లో నటించాడు నరేష్. మరి ఈ సినిమా కనుక హిట్ అయితే తననుండి ఈ టైపు సినిమాలు మరిన్ని వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు..

sai pallavi revealed interesting things About Varun Tej!

naga chaithanya peru venaka dhaagi unna rahasyam!