దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటం, బాహుబలి తర్వాత జక్కన్న నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. లాక్ డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు టీమ్. ఈమధ్య జరిగిన షెడ్యూల్లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ జాయిన్ కావడం జరిగింది.
alia bhatt wraps up her first schedule for ‘rrr’!
సినిమాలో ఆమె రామ్ చరణ్ కు జోడిగా నటిస్తోంది. ఈ షెడ్యూల్లో ఆమెకు, రామ్ చరణ్ కు మధ్యన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో ఆమె హైదరాబాద్ నుండి ముంబై వెళ్లిపోయారట. మళ్ళీ ఆమె వచ్చే నెల నుండి కొత్తగా మొదలుకానున్న షెడ్యూల్లో పాల్గొననున్నారు. భారీ వ్యయంతో నిర్మితమవుతున్న సినిమాపై ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి..