in

Alia Bhatt unfollowed SS Rajamouli, deleted RRR posts on Instagram?

RRR సినిమా రికార్డులన్నీ బద్దలుకొట్టుకుంటూ.. ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ.. హౌస్‌ఫుల్ షోస్‌తో దూసుకుపోతోంది. ఇందులో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఆలియా మాత్రం ఆర్ఆర్ఆర్ విషయంలో అస్సలు హ్యాపీగా లేనట్టు సమాచారం. అందుకే తన ఇన్‌స్టాగ్రామ్ నుండి ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన పోస్టులు కూడా డిలీట్ చేసిందట. ఇంతకీ ఏం జరిగింది. ఆలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్‌లోనే వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. అయితే అదే సమయంలో తనకు ఆర్ఆర్ఆర్ నుండి ఆఫర్ వచ్చింది.

రాజమౌళి లాంటి డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆలియా దీనికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతే కాకుండా జనవరిలో రిలీజ్ అనుకున్న సమయంలో ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా పాల్గొంది. ఇంతలోనే అమ్మడు ఆర్ఆర్ఆర్‌ను దూరం పెడుతున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో ఆలియా పాత్ర నిడివి కాసేపే ఉంటుంది కానీ సినిమాకు అదే జీవం అని చెప్పింది మూవీ టీమ్. కానీ సినిమా విడుదలయిన తర్వాత అందులో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ తప్ప ఇంకెవరినీ చూడలేకపోయారు ప్రేక్షకులు.

అంతే కాకుండా ఆలియా పాత్ర కూడా మూవీ టీమ్ క్రియేట్ చేసిన హైప్‌కు రీచ్ కాలేకపోయిందని కొందరి వాదన. ఆర్ఆర్ఆర్‌లో కేవలం 15 నిమిషాల పాత్ర కోసం ఏకంగా రూ. 5 కోట్లు ఛార్జ్ చేసిందట ఆలియా. తెలుగులో తొలిచిత్రం కాబట్టి.. అది కూడా రాజమౌళి డైరెక్షన్‌లో కాబట్టి తనకు చాలా గుర్తింపు వస్తుందని భావించిన ఆలియాకు నిరాశే మిగిలింది. అందుకే ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్స్ మినహా ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సినిమాకు సంబంధించిన మరే పోస్టులు లేవు. అంతే కాకుండా రాజమౌళిని అన్‌ఫాలో కూడా చేసింది ఆలియా భట్.

official: telugu sensation Krithi Shetty joins Suriya 41

Change of heroine in Chiranjeevi’s next for ravi teja!