in

Alia Bhatt to produce a young-adult film!

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో ఆమె దక్షిణాదిన కూడా అదిరిపోయే ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఇక రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లి తర్వాత ఆమె కొన్ని సెలెక్టివ్ చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఆమె ఓ అడల్ట్ చిత్రాన్ని అభిమానులకు అందించేందుకు సిద్ధమైంది.

అయితే, ఆమె అడల్ట్ చిత్రంలో నటించదని.. దాన్ని ప్రొడ్యూస్ చేయనుందని తెలుస్తోంది. శ్రీతి ముఖర్జీ అనే డైరెక్టర్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేయనుందట ఆలియా. తన సొంత బ్యానర్ ఎటర్నల్ సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ఆలియా ప్రొడ్యూస్ చేయనుందట. కొత్త నటీనటులతో కాలేజీ లైఫ్ నేపథ్యంలో ఈ సినిమా రానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు బి టౌన్ వర్గాలు తెలిపాయి..!!

Sameera Reddy returns to the silver screen after 13 years!