in

Alia Bhatt says NO to work with Ranbir Kapoor in Ramayana?

పౌరాణికాలపై ఇటీవల వచ్చిన సినిమాలు నిరాశ ఫలితాలు ఇచ్చిన..నిర్మాతలు మరియు దర్శకులు ఇలాంటి మరిన్ని సినిమాలు తీయాలని ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు. గుణశేఖర్ యొక్క ‘శాకుంతలం’ మరియు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ ఇటీవలి కాలంలో అతిపెద్ద పరాజయాలను చూశాయి. అయితే ఓ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రామాయణంపై మరో సినిమా తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. రణబీర్ కపూర్ రాముడిగా మూడు భాగాలుగా రామాయణంపై సినిమా తీయాలని నిర్మాత మధు మంతెన ప్లాన్ చేస్తున్నారు. సీత పాత్ర కోసం అలియా భట్‌ ని, రావణ పాత్ర కోసం కెజిఎఫ్ రాకీ భాయ్ యష్‌ ని కూడా టీమ్ సంప్రదించింది. తాజా అప్‌డేట్‌లో, అలియా భట్ పౌరాణిక నాటకానికి నో చెప్పిందని తెలుస్తుంది.

తన భర్తతో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు ఆ ఆఫర్‌ను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందని చాలామంది ఆలోచించడం మొదలుపెట్టారు. ఆమె ఆఫర్‌ను తిరస్కరించడానికి ప్రధాన కారణం ఆమె బిజీ షెడ్యూల్ అని తెలుస్తోంది. అలియా భట్ క్యాలెండర్ నిండిపోయింది మరియు ఆమె రామాయణం కోసం సమయాన్ని సర్దుబాటు చేయడం కుదరదని సమాచారం..RRR లో సీత పాత్ర చేసిన అలియా..పూర్తి రామాయణ లో సీత గా చేస్తే చూడడానికి బాగుంటుంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు..!!

Bava Bonding: Jr NTR Congratulates Allu Arjun on National Award Win

SreeLeela taking a big break from shooting, here’s why!