in

Alia Bhatt charged rs 50 lakhs per day for ‘RRR’ shoot!

క‌థానాయిక‌ల పారితోషికాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. స్టార్ డ‌మ్ ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలంటే నిర్మాత‌ల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. పాన్ ఇండియా మోజులో – బాలీవుడ్ క‌థానాయిక‌ల్ని దిగుమ‌తి చేసుకోవ‌డంవ త‌ప్ప‌నిస‌రి అయ్యింది. త‌మ డిమాండ్ ని ప‌సి గ‌ట్టిన హీరోయిన్లు ఒక్క‌సారిగా రేటు పెంచేస్తున్నారు. అలియా భ‌ట్ అదే చేసింది. కేవ‌లం 15 నిమిషాల పాత్ర కోసం ఏకంగా 5 కోట్లు లాగేసింది. తాను ఆర్‌.ఆర్‌.ఆర్‌ కోసం కేవలం 10 నుండి 12 డేట్స్ మాత్రమే ఇచ్చింది..దీనిలెక్కన చూస్తే అలియా రోజుకి 50 లక్షలు తన ఖాతాలో వేసుకుంది..టూ మచ్ కాదా భయ్యా..

సాధార‌ణంగా ఓ బాలీవుడ్ చిత్రానికి అలియా అందుకునే పారితోషికం 5 కోట్లు ఉంటుంది. కాక‌పోతే.. ఒక్కో సినిమాకి క‌నీసం 2 నెల‌ల స‌మ‌యం కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఆర్‌.ఆర్‌.ఆర్ కోసం ఇంత తక్కువ సమయంలో కేవ‌లం 15 నిమిషాల పాత్ర కోసం 5 కోట్లు అందుకుంది. అలియా వ‌ల్ల‌… బాలీవుడ్ లో ఈ సినిమాకంటూ ప్ర‌త్యేక‌మైన మైలేజీ వ‌స్తుంద‌న్న‌ది నిర్మాత ఆశ‌. కానీ.. అలాంటిదేం జ‌ర‌గ‌లేదు. ఇది రాజ‌మౌళి సినిమాగానే బాలీవుడ్ వెళ్తోంది. అలియా వ‌ల్ల వ‌చ్చిన అద‌న‌పు మైలేజీ ఏం లేదు. అలాంట‌ప్పుడు.. రూ.5 కోట్లు ఎలా ఇచ్చారో?

gorgeous sony charishta stills in transparent saree!

Amala Paul out and Mehreen in for Nagarjuna’s ‘The Ghost’!