బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరోసారి అరుదైన ఘనత సాధించారు. ఇన్‌స్టాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావంతమైన నటీమణుల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ హైప్ ఆడిటర్ నివేదిక ప్రకటించారు. హాలీవుడ్ దిగ్గజాలు డ్వేన్ జాన్సన్, జెన్నిఫర్ లోపెజ్‌లను అధిగమించి, జెండయా తర్వాత స్థానంలో నిలిచారు. దీంతో అభిమానులు ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఆలియాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్‌స్టాలో ఈమెకు 85 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అలియా తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. అంతేకాదు ఫొటో షూట్‌లతో ఆకట్టుకుంటుంటారు. ఆలియా గతేడాది కూడా టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన వంద మోస్ట్ ఇన్‌ప్లూయెన్షియల్ పీపుల్ ఆప్ 2024 జాబితాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే..!!