నటుడు బ్రహ్మాజీ గారు ఎవరి ఇన్స్పిరేషన్ తో నటుడు అయ్యారో మీకు తెలుసా? తెలియదు కదూ నాకు తెలుసు చెపుతా వినండి. కాలేజీ రోజుల్లో బ్రహ్మాజీ గారు కృష్ణ గారికి వీరాభిమాని. బ్రహ్మాజీ గారి నాన్న గారు ఏలూరు లో తహసీల్దార్ గ పని చేసే వారు, అప్పట్లో డిప్యూటీ కలెక్టర్ గ పని చేస్తున్న సోమయాజులు గారు శంకరాభరణం చిత్రంలో నటించారు, రెవిన్యూ డిపార్ట్మెంట్ తరపున వారి సహా ఉద్యోగులు సోమయాజులు గారికి ఏలూరు లో సన్మానం చేసారు. తహసీల్దార్ గారి అబ్బాయి అయిన బ్రహ్మాజీ గారు స్టేజి మీద సోమయాజులు గారిని చాల దగ్గరగా చూసే అవకాశం కలిగింది, స్టేజి మీదకు వచ్చిన పెద్ద, చిన్న వారంతా సోమయాజులు గారి కాళ్ళకు నమస్కరించటం చూసిన బ్రహ్మాజీ గారు చలించి పోయారు.
ఒక సాధారణ డిప్యూటీ కలెక్టర్ గ సోమయాజులు గారు అక్కడికి వచ్చి ఉంటె ఇలా చేసే వార ఎవరైనా, నటుడిగా అయన పోషించిన పాత్ర జనాన్ని ఎంత ప్రభావితం చేసిందో చూసి ఇన్స్పైర్ అయిన బ్రహ్మాజీ గారు ఆ స్టేజి మీదే మనసులో అనుకున్నారట తాను కూడా నటుడు అవ్వాలని. సీన్ కట్ చేస్తే ఇంటర్ అయిన తరువాత ఏ.ఎం.ఐ.ఈ. చదువుతాను అనే సాకు తో సర్కార్ ఏక్సప్రెస్ ఎక్కి మద్రాస్ నగర ప్రవేశం చేసారు సినిమా లలో నటించాలనే ఉద్దేశం తో. ఆ తరువాత తన కలను నిజం చేసుకొని మూడు దశాబ్దాలకు పైగా నటుడిగా కొనసాగుతున్నారు.