యెన్.టి.ఆర్ పురాణ పురుషులు అయిన రాముడు, కృష్ణుడు వంటి పాత్రలకు పెట్టింది పేరు, అదే క్రమం లో భక్తుడి పాత్రలకు కేర్ అఫ్ అడ్రస్ అక్కినేని. అక్కినేని గారు భక్తుడిగా, కవిగా నటించిన భక్తి రస చిత్రాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. వాగ్గేయకారుడు త్యాగయ్య సినిమా తీయాలని తలచిన బాపు, రమణ గార్లు మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారిని కలసి తమ చిత్రానికి పాటలు పాడాలని అడిగారు, దానికి అయన పాడతాను కానీ, త్యాగయ్య పాత్ర కూడా నేనే పోషిస్తాను అని కూర్చున్నారు, మహా ప్రభో!! మేము త్యాగయ్య పాత్రకు అక్కినేని గారిని అనుకున్నాము, మీరు పాటలు మాత్రమే పాడితే చాలు, అని విన్నవించుకున్న కూడా, అయన ససేమీరా అనటం తో అక్కడ నుంచి తిరిగి వచ్చిన బాపు, రమణల ద్వయం అక్కినేని గారిని కలిశారు, విషయం విన్న, అక్కినేని గారు తప్పకుండ చేద్దాము, కానీ మీరు పదేళ్లు ఆగాలని చెప్పారట..
ఎందుకంటె అప్పుడు అక్కినేని గారు “ప్రేమాభిషేకం” వంటి రొమాంటిక్ చిత్రాలతో బిజీ గాఉన్నారు కాబట్టి, ఇటువంటి భక్తి రస ప్రధాన చిత్రం చేయాలంటే మరో పదేళ్లు పడుతుంది అనే ఉద్దేశం తో చెప్పారు. ఆ సమాధానం విన్న బాపు, రమణ గార్లు చేసేదేమి లేక తిరిగి మద్రాసు వెళ్లిపోయారు. అదే సందర్భం లో శంకరాభరణం విజయం చూసి స్ఫూర్తి పొందిన , నిర్మాత నవతా కృష్ణమరాజు , త్యాగయ్య చిత్రం తీయాలని ప్రయత్నంలో భాగం గ వీరిని కలిశారు. ఆయనతో ,అక్కినేని గారు చెప్పిన మాట చెప్పారు బాపు గారు, అయితే పదేళ్లు ఆగలేము కదా ,సోమయాజులు గారిని పెట్టి తీద్దాము అన్నారు కృష్ణమరాజు గారు. అదే విషయాన్నీ అయన పత్రికలలో ప్రకటన కూడా చేసేసారు, పత్రికలలో ప్రకటన వచ్చేంత వరకు బాపు, రమణలకు విషయం తెలియదు..
కంగారుపడిన వీరు, అదేమిటి, రాజు గారు అక్కినేని గారికి ఒక్క మాట చెపితే బావుంటుంది అన్నారట. అదే క్రమం లో వీరిద్దరూ అక్కినేని గారిని కలిశారు, అప్పటికే ప్రకటన చూసిన అక్కినేని గారు అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు, బాపు, రమణల మీద ఫైర్ అయ్యారు, నేను అనుకుంటే మీరు ఫస్ట్ షాట్ తీసేలోపు, మరో దర్శకుడి తో నా చిత్రం పూర్తి చేసి రిలీజ్ చేయగలను అని మండి పడ్డారట, అయినప్పటికీ వీరు ఆయనను శాంతిపచేసి కాల్ షీట్స్ అడిగితే కనీసం ఐదేళ్లు ఆగాలని చెప్పారట అక్కినేని, అంతే ఇక,ఆ చేసేదేమి లేక మద్రాసు తిరిగి వచ్చిన బాపు, రమణ సోమయాజులు గారితో త్యాగయ్య సినిమా పూర్తి చేసారు. కానీ ఆ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.అక్కినేని గారు త్యాగయ్య గ కనిపించి ఉంటె ఎలా ఉండేదో మరి!!!