[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]అ[/qodef_dropcaps] క్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో అఖిల్ గాయపడ్డాడట. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఫైటింగ్ సీన్ జరుగుతుండగా.. జరిగిన ప్రమాదంలో అఖిల్ కుడి చేతికి గాయం అవ్వగా.. డాక్టర్లు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. ప్రస్తుతం అఖిల్ రెస్ట్ తీసుకుంటున్నాడు.
వారం రోజుల తర్వాత అంటే.. మార్చ్ 12వ తేదీ నుంచి మళ్లీ అఖిల్ రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. గీత గోవిందం ఫేమ్ గోపిసుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. హ్యాట్రిక్ ఫ్లాపులతో ఉన్న అఖిల్‌కు ఈ సినిమా విజయం తప్పనిసరి. ఈ క్రమంలో సినిమా కోసం అఖిల్ గట్టిగా కష్టపడుతున్నాడట.