in

Akhil Akkineni much Younger Than Zainab Ravdjee!

క్కినేని నాగార్జున ఇంట్లో పెళ్లి సందడి కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున సరిగ్గా మూడు గంటల అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని అలాగే జైనాబ్ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. జూబ్లీహిల్స్ లోని అక్కినేని నాగార్జున ఇంట్లోనే ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు అలాగే రామ్ చరణ్, ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, రాజమౌళి కుటుంబం తదితరులు వచ్చారు..

వీళ్లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక జూన్ 8వ తేదీన ఆదివారం రోజు అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని అఖిల్ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్స్ అలాగే రాజకీయ నాయకులు అటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. ఆదివారం రోజున జరిగే రిసెప్షన్ ను భారీ రేంజ్ లో నిర్వహిస్తోంది అక్కినేని ఫ్యామిలీ. కాగా అఖిల్ అక్కినేని అలాగే జైనాబ్ మధ్య 9 ఏళ్ళవయసు గ్యాప్ ఉందని సమాచారం..!!

pushpa director Sukumar to direct Shah Rukh Khan!

Ananya Pandey Sets Tollywood Abuzz with Her Item Song!