ఈఏడాది సంక్రాంతికి ఆరుగురు హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. గేమ్ చేంజర్ తో అంజలి, కియారా అద్వానీ. డాకు మహారాజ్ తో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి. వీరందరూ సంక్రాంతి సినిమాలపై మంచి హోప్స్ పెట్టు కున్నారు. కారణం ఇప్పటివరకు పెద్దగా గుర్తింపులేని పాత్రలు చేయటం. ఇప్పడు అంతా మంచి ఫేమ్ ఉన్న వాళ్లు కావటంతో భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ వీరందరిలో అనుకున్న పేరు తెచుకున్నది ఐశ్వర్యా రాజేష్ మాత్రమే అని చెప్పొచ్చు.
గేమ్ చేంజర్ లో అంజలి పాత్రకి మంచి పేరు వచ్చినా, సినిమాలో స్కోప్ తక్కువ ఉంది..ఐశ్వర్యా రాజేష్ మాత్రం సినిమా మొత్తం మెరిసి తన నటనతో ఆకట్టుకుంది. కెరియర్ స్టార్ట్ చేసిన ఇన్నాళ్ళకి తెలుగులో మొదటి హిట్ అందుకుంది. అలనాటి హీరో రాజేష్ కూతురైన ఐశ్వర్య తెలుగులో అవకాశాలు రాక కోలీవుడ్ లో రాణిస్తోంది. కానీ ఇప్పడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేష్ భార్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఐశ్యర్య నటన, ఆహార్యంతో స్టార్ హీరోయిన్ సౌందర్యని తలపించింది. వెంకీ, భాగ్యం జోడీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు..!!