ఆహా కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది వాణీ కపూర్. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రాలేదు. ఆ తర్వత బాలీవుడ్ నుంచి ఈ బ్యూటీకి అవకాశాలు తలుపు తట్టాయి..ప్రస్తుతం బాలీవుడ్లో ఈ బ్యూటీ హవా నడుస్తోంది. అయితే వాణీ కపూర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.
కపూర్ కుటుంబం నుంచి సినీ పరిశ్రమకు పరిచయమైన వాణీకపూర్ కూడా ఆర్థిక కష్టాలను చవిచూసిందట. 18-19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోందట. ఆ సమయంలోనే కుటుంబానికి అండగా నిలబడాలనే నిర్ణయంతో కుటుంబ బాధ్యతలను తను తీసుకున్నట్లుగా ఇటీవల వాణీకపూర్ తెలిపింది. పరిస్థితులు మనిషిని ఎలాంటి స్థాయిలోకైనా నెట్టేస్తాయని.. కానీ వాటిని తట్టుకుని నిలబడినప్పుడే జీవితం ముందుకు సాగుతుందని..
ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్లాలని సంకల్పం ఉండాలని తెలిపింది. ఇక నటిగా ఎదిగే క్రమంలో తల్లిదండ్రుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. తానే స్వయంగా సమకూర్చుకున్నాని.. ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇప్పుడున్న స్థాయిలోనూ గతంలో పడిన కష్టాలు.. భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లెందుకు ధైర్యాన్ని అందించాయని చెప్పుకొచ్చింది. చాలా కాలం తర్వాత తెలుగులోకి ఈ అమ్మడు రీఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.