in

agent girl sakshi vaidya to romance 3 mega heroes!

మాములుగా ఒక హీరోయిన్ కి డెబ్యూతోనే డిజాస్టర్ పడితే అవకాశాలు అంత సులభంగా రావు. అందులోనూ టాలీవుడ్ లో సెంటిమెంట్లు ఎక్కువ. ఒక హిట్టు పడ్డాక చూద్దాంలే అని ఎదురు చూస్తారు. కానీ సాక్షి వైద్యకు సీన్ రివర్స్ లో ఉంది. అఖిల్ ఏజెంట్ తో తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి ఎంట్రీనే చేదు అనుభవం ఇచ్చింది. ఈ ఏడాది అది పెద్ద ఫ్లాప్ గా ఏజెంట్ గురించి ఎన్ని ట్రోల్స్ వచ్చాయో లెక్క చెప్పడం కష్టం. దెబ్బకు ఓటిటి వెర్షన్ కోసం మళ్ళీ ఎడిటింగ్ చేయాల్సి వచ్చిందంటేనే ఆడియన్స్ దాన్ని ఎంతగా తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు.

ట్విస్ట్ ఏంటంటే సాక్షి వైద్యకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. మెగా ప్రిన్స్ గాండీవధారి అర్జునలో ఆల్రెడీ చేస్తోంది. త్వరలోనే షూటింగ్ పూర్తి కాబోతోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందబోయే గాంజా శంకర్(ప్రచారంలో ఉన్న టైటిల్)కి తన పేరే బలంగా పరిశీలిస్తున్నారట. ఓకే కాగానే అఫీషియల్ గా ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల కాకుండా సెకండ్ హీరోయిన్ గా సాక్షినే అడిగినట్టు ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది. కానీ రెండో కథానాయిక కాబట్టి ఇంకా ఎస్ చెప్పలేదట. పవర్ స్టార్ కాబట్టి కాదనే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు..!!

3 beauties waiting for mahesh babu’s guntur Karam?

samyuktha or sreeleela, what is guruji’s choice?