in

Agent beauty Sakshi Vaidya grabs Ustaad Bhagat Singh!

జెంట్ బ్యూటీ సాక్షి వైద్య బంపర్ అఫర్ కొట్టేసింది..అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాలో హీరోయిన్ నటించిన సాక్షి వైద్య ఆ సినిమా ఫ్లాప్ అయిన కూడా ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్స్ తో దూసుకుపోతుంది. లేటెస్ట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ‘గాండీవధారి అర్జున’ సినిమాలో నటించిన సాక్షి వైద్య, త్వరలోనే మరో మెగా హీరో కు జోడిగా నటించబోతుందని టాక్ జోరుగా వినిపిస్తోంది. డాక్టర్ ప్రొఫెషన్ ను పక్కన పెట్టి యాక్ట్రెస్ గా మారిన సాక్షి వైద్య మొదటి సినిమా తేడా కొట్టిన కూడా ఆఫర్స్ మాత్రం గట్టిగానే వస్తున్నాయ్. ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ సినిమాలో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసిందని టాక్.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చే సెప్టెంబర్ 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించాల్సి ఉండగా..ఒక హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. ఇక మరో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించనుందని సమాచారం. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ అంత పలు సినిమాలలో బిజీగా ఉన్న కారణంగా ఎవరు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు..అందుకే యంగ్ బ్యూటీస్ ను లైన్ లో పెడుతున్నారు ఫిలిం మేకర్స్..!!

bhola effect, sai pallavi and keerthy suresh’s mixed reactions!

Not allu arjun But Nithiin To Become ‘Icon’ ?