తమిళంలో మహావీరుడుతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన సునిల్ కు రజనీకాంత్ జైలర్ పెద్ద బ్రేక్ ఇచ్చింది. లెన్త్ తక్కువగా ఉన్నా ఇంపాక్ట్ ఎక్కువగా వచ్చింది. మార్క్ ఆంటోనీలో విశాల్, ఎస్జె సూర్యల డ్యూయల్ రోల్స్ మధ్య తన ఉనికిని చాటుకోవడం విశేషమే. కార్తి జపాన్ సినిమానే తేడా కొట్టింది కానీ సరైన రీతిలో తీసుంటే ఇంకో బ్రేక్ దక్కింది. తాజాగా సునీల్ మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కొత్త చిత్రం టర్బోలో ఛాన్స్ కొట్టేశాడు.
మాములుగా మల్లువుడ్ లో తెలుగు ఆర్టిస్టులకు ఆఫర్లు రావడం చాలా అరుదు. చూసిన దాఖలాలు తక్కువే. అలాంటిది ఇంత పెద్ద అవకాశం వెతుక్కుంటూ రావడం మాటలు కాదు. ఇది పుష్ప ప్రభావమేనని మళ్ళీ చెప్పనక్కర్లేదు. తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా కూల్ గా చేసిన విలనిజం ఇంత బ్రేక్ ఇస్తుందని బహుశా ఆ క్యారెక్టర్ ని సృష్టించిన దర్శకుడు సుకుమార్ ఊహించి ఉండడు. ఇలా బిజీ అయిపోతున్న కారణంగానే సునీల్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లు ఒప్పుకోవడం మానేశాడట..!!