in

after ajay devgan, now rakul to romance akshay kumar!

ప్రస్తుతం రకుల్ విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమాలో కీలక పాత్ర చేస్తుంది. ఆలాగే తెలుగులో వైష్ణవ్ తేజ్ నటించిన కొండపోలం సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ పల్లెటూరి యువతిగా కనిపించనుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడికి అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. అయితే ఆ ఆఫర్ వచ్చింది తెలుగులో కాదు..

అలాఅని తమిళ్‌లోనూ కాదు.. బాలీవుడ్‌లో. తెలుగు-తమిళ్ భాషల్లో సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాను హిందీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీమేక్ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్‌ను అనుకుంటున్నారట. ఈ సినిమాలో రకుల్ పాత్రకు కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కనుక నటిగా నిరూపించుకునేందుకు ఈ అమ్మడికి అవకాశం ఉంది. మరి రకుల్ రాక్షసుడితోనైనా అక్కడ రాణిస్తుందేమో చూడాలి.

anchor shymala hot stills clicked at her home!

Kriti Sanon says she wants to MARRY her Adipurush costar Prabhas!