
కొంత మంది తన పేరుతో వాట్సాప్‌లో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను హైదరీ హెచ్చరించారు. తన ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకుని ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫొటోగ్రాఫర్లను సంప్రదిస్తూ ఫొటోషూట్‌ల గురించి మాట్లాడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. “కొంతమంది నా దృష్టికి తెచ్చిన ఓ విషయాన్ని పోస్ట్ చేశారు..
వాట్సాప్‌లో ఎవరో నా ఫొటో పెట్టుకుని, నేనే అన్నట్లుగా ఫొటోగ్రాఫర్లకు మెసేజ్‌లు చేస్తున్నారు. అది తాను కాదని. నేను వ్యక్తిగతంగా ఎవరినీ ఇలా సంప్రదించనని స్పష్టం చేశారు. నా పనులన్నీ నా టీమ్ చూసుకుంటుందని తెల్చి చేప్పారు. దయచేసి ఆ నంబర్‌తో ఎవరూ మాట్లాడొద్దని, అనుమానస్పదంగా ఉంటే వెంటనే తమటీమ్ కు చెప్పాలన్నారు. ఈ క్రమంలో తన అభిమానులు, సహచరులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు..!!

