సినిమా ఇండస్ట్రీని కుదిపేసిన అంశం క్యాస్టింగ్ కౌచ్. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ ఆశచూపి లైంగిక కోర్కెలు తీర్చుకోవడం. ఈ క్యాస్టింగ్ కౌచ్‌లో చాలా మంది హీరోయిన్లు బాధితులుగా ఉన్నారు. అలాంటి వారిలో చాలా మంది ఇటీవలి కాలంలో బహిర్గతమయ్యారు. చాలా మంది మాత్రం తమ సినీ కెరీర్ దృష్ట్యా సర్దుకునిపోతున్నారు. అయితే, తెలుగులో హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ ఆదా శర్మ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం, కల్కి వంటి చిత్రాలతో పాటు.. పలు హిందీ, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించింది.
ఈమె ఇపుడు క్యాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించింది. ‘దక్షిణాది చిత్రసీమలో లేదా ఉత్తరాదిన హిందీ చిత్ర పరిశ్రమలో మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ ఉందనుకోవద్దు. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ కౌచ్ సంస్కృతి ఉంది’ అని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా, ‘నా దృష్టిలో ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ ఓ ఛాయిస్ ఉంటుంది… కౌచ్‌లో కూర్చోవాలా?, పడుకోవాలా? నిలబడాలా? లేదంటే అసలు ఏమీ చేయకూడదా? అని! నేల మీద కూడా కూర్చోవచ్చు కదా!’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.