రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన.. పొడువు కాళ్ల సుందరి రకుల్ ప్రీత్ సింగ్ ముందుగా అక్కినేని వారసుడు అఖిల్ తో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో నటించారు. ఆ తరువాత అతని తండ్రి కింగ్ నాగార్జున గారితో కూడా మన్మధుడు – 2 లో హీరోయిన్ గ చేసారు.. కానీ ఆమె బ్యాడ్ లక్ ఈ రెండు సినిమాలు గోరంగా ప్లాప్ అయ్యాయి.
లావణ్య త్రిపాఠి
రకుల్ దారిలో నడిచింది నాచురల్ బ్యూటీ లావణ్య త్రిపాఠి..కానీ ఈవిడ రివర్స్ లో వచ్చింది. ముందుగా తండ్రి నాగ్ తో ‘సోగ్గాడే చిన్ని నాయన’ అంటూ రొమాన్స్ చేసి..ఆ తరువాత కొడుకు చైతు తో ‘యుద్ధం శరణం’ చేసింది. తండ్రి సినిమా సూపర్ హిట్ అవ్వగా, కొడుకు సినిమా బెడిసి కొట్టింది.
కాజల్ అగర్వాల్
వయసుతో సంబంధం లేకుండా ఎవరితో అయినా కలిసి మెలిసి నటించగల హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్. మగధీర, నాయక్, సినిమాల్లో చరణ్ తో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ..ఆ తరువాత తన తండ్రి మెగాస్టార్ గారి కమ్ బ్యాక్ ఫిలిం ‘ఖైదీ నెంబర్ 150’ లో నటించింది. తండ్రి కొడుకులతో కాజల్ చేసిన ఈ సినిమాలు అన్ని సూపర్ హిట్ అవ్వడం విశేషం.
జయసుధ
సహజ నటి జయసుధ గారు కూడా తండ్రి కొడుకులతో హీరోయిన్ గ నటించారు, టాలీవుడ్ లెజెండరీ హీరో ఎన్టీఆర్ గారితో కలిసి ‘డ్రైవర్ రాముడు, నా దేశం’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించగా.. చాలా ఏళ్ళ తరువాత ఎన్టీఆర్ గారి కొడుకు బాలయ్య బాబు గారితో ‘అధినాయకుడు’ అనే సినిమాలో కూడా నటించారు జయసుధ.
శ్రీదేవి
తెలుగు సినిమా ప్రేక్షకుల అల్ టైం ఫేవరెట్ హీరోయిన్ లో ఒకరు అతిలోక సుందరి శ్రీదేవి గారు, ముందుగా ANR గారితో ‘ప్రేమాభిషేకం,ముద్దుల కొడుకు’ వంటి సినిమాల్లో నటించిన ఆవిడ..ఆ తరువాత నాగార్జున గారితో ‘గోవింద గోవింద’ సినిమాలో నటించారు.. అక్కినేని హీరోస్ తో శ్రీదేవి గారు చేసిన అన్ని సినిమాలు హిట్ అవ్వడం విశేషం.