in

actress vedika about negative mindset and trolls!

రీసెంట్‌గా వేదిక నటించిన యక్షిణి వెబ్ సిరీస్ రిలీజ్ కాగా..దీనికి ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా విమర్శకులపై, నెటిజన్స్‌పై ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయింది వేదిక. హీరోయిన్ అనగానే ఎవరికీ తోచినట్లు వారు మాట్లాడే విధానం మారాలని వేదిక చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో హీరోయిన్లపై అనవసరమైన, అసభ్యమైన కామెంట్లు ఎక్కువైపోతున్నాయని.. కేవలం గ్లామరస్‌గా కనిపించినంత మాత్రాన ఒకరి క్యారెక్టర్‌ని తప్పుబట్టడం సరికాదంది వేదిక.

ఈ విషయం తనకు చాలా బాధని కలిగించిందని ఎమోషనల్ అయింది..హీరోయిన్లు వేసుకునే బట్టల గురించి మాట్లాడే బదులు.. వారి పనితీరును గుర్తించాలని వేదిక సూచించింది. తాను నటనలో ఏ పాత్రకైనా సిద్ధమని.. బికినీ వేసుకొని నటించడానికి కూడా వెనుకాడనని చెప్పింది. నేనెంటో నాకు బాగా తెలుసు..అయిన మారాల్సింది నేను కాదు..తప్పుడు మైండ్‌సెట్ ఉన్నవాళ్లు అంటూ మండిపడింది. ప్రస్తుతం వేదిక చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి..!!

south producers not happy with deepika padukone’s attitude!

Rashi reveals missed chance in Rangasthalam!