మీటూ వల్ల తనపై వేధింపులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది తనుశ్రీ. ‘నేను విపరీతంగా వేధింపులకు గురవుతున్నాను. ఎవరైనా, ఏదైనా చేయండి ప్లీజ్. ముందుగా నా బాలీవుడ్ కెరీర్‌ను నాశనం చేశారు.ఆ తర్వాత ఓ పనిమనిషి ద్వారా తాగే నీళ్లలో మందులు ఇప్పించారు. దాని వల్ల నాకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయి. మేలో ఊరు వదిలి వెళ్లిపోదామనుకున్నా కానీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయ్యింది. చివరికి ప్రాణాలతో బయటపడి 40 రోజుల తర్వాత నా జీవితాన్ని మళ్లీ ప్రారంభించడానికి ముంబాయి వచ్చాను.
ఇప్పుడు ఫ్లాట్ బయట అన్ని ఇబ్బందికర సంఘటనలు జరుగుతున్నాయి’. ‘ఏం జరిగినా నేను మాత్రం ఆత్మహత్య చేసుకోదలచుకోలేదు. ఇది మీరంతా చెవులు తెరుచుకొని వినండి. అంతే కాకుండా నేను ఎక్కడికి పారిపోవట్లేదు కూడా. నేను ఇక్కడే ఉండి.. ముందుకంటే ఎక్కువ సక్సెస్‌ను చూస్తాను. బాలీవుడ్ మాఫియా, మహారాష్ట్ర రాజకీయం కలిసి మనుషులను ఇలా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంటాయి. మీ టూ నిందితులు, ఓ ఎన్జీవో కలిసే ఇదంతా చేస్తున్నారు. లేకపోతే నన్ను ఇలా వేధించే అవసరం ఇంకెవరికి ఉంటుంది? ఈ వేధింపులు నాపై మానసికంగా, శారీరికంగా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
అన్యాయానికి ఎదురుగా వెళ్లిన అబ్బాయిలు, అమ్మాయిలను చంపేసే ఈ చోటును ఏం అనాలి?’ ‘మహారాష్ట్రలో, కేంద్రస్థాయిలో మిలిటరీ పాలన, రాష్ట్రపతి పాలన వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ప్రస్తుతం పరిస్థితులు చేజారిపోతున్నాయి. నాలాంటి సామాన్యులు మూగబోయేలా చేస్తున్నారు. ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకు జరగవచ్చు. ఈ సిటీలో చట్టం, న్యాయం అనేవి ఇంక లేవు. ఒకప్పుడు ఆర్టిస్టులకు, ఒంటరి మహిళలకు రక్షణ ఉండేది. కృష్ణుడా నన్ను కాపాడు’ అని తనుశ్రీ దత్తా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది…